
ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాష ఇదే..
ప్రపంచంలో అత్యధిక ప్రజలు మాట్లాడే భాషగా ఇంగ్లిష్ నిలిచింది. ఈ విషయాన్ని వరల్డ్ ఆఫ్ స్టాటిక్స్ ట్విటర్‌లో వెల్లడించింది. 1వ స్థానంలో ఇంగ్లిష్ 113.2 కోట్ల మంది, 2వ ప్లేస్‌లో చైనా మాండరిన్ 111.7 కోట్ల మంది, 3వ స్థానంలో భారతీయ భాష హిందీ 61.5 కోట్ల మంది మాట్లాడుతున్నారని పేర్కొంది. టాప్-50 భాషల్లో భారత్‌కు చెందిన బెంగాలీ (26.5 కోట్ల మంది) 7వ స్థానంలో, తెలుగు (9.3 కోట్ల మంది) 16వ స్థానంలో ఉన్నాయి.
01:51 PM, 15th Jul 2023